telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన బాలయ్య

Balakrishna-and-Mokshagna

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ‌ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య వారసుడు మాత్రం గత ఐదేళ్ల నుంచి ఎంట్రీ ఇస్తారనే అంటున్నారు. ‘మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి రావడానికి చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు.. డెఫనేట్‌గా సినిమాల్లోకి వస్తాడు. అతనికి వేరే దారిలేక కాదు.. సినిమాలంటే చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడు. అతన్ని బలవంతంగా తోయడం లేదు.. సినిమాలంటే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి ప్రోత్సహిస్తా.. మా నాన్న గారు నన్ను సినిమాల్లోకి రామని బలవంతం చేయలేదు.. నేను కూడా అంతే. నా కొడుకు ఇంట్రస్ట్ ఉందంటేనే ప్రోత్సహిస్తా అంటూ 2018లోనే తెలిపిన బాలయ్య.. తాజాగా మరోసారి మోక్షజ్ఞ‌ ఎంట్రీపై స్పందిస్తూ త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని తెలిపారు. తదాస్తు దేవతులు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడే.. దీనికి ప్రత్యేకించి ప్లానింగ్ అంటూ ఏం లేదు.. మంచి మూడ్ ఉంటే తీసుకొచ్చి కెమెరా ముందు నిలబెట్టేయడమే’ అంటూ మోక్షజ్ఞ‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య.

Related posts