telugu navyamedia
సినిమా వార్తలు

నెటిజన్ కామెంట్ కు ఘాటుగా స్పందించిన నమ్రత

Mahesh-Babu

మహేష్ “మహర్షి” చిత్రం విడుదలై హిట్ టాక్ ను సింథమ్ చేసుకుంది. గురువారం విడుద‌లైన “మ‌హ‌ర్షి” సినిమా విజ‌యం సంద‌ర్భంగా మ‌హేష్‌, వంశీపైడిప‌ల్లి కుటుంబ స‌భ్యులు పార్టీ చేసుకున్నారు. “మ‌హ‌ర్షి” సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్‌. ఇంత‌టి గొప్ప చిత్రాన్ని ఇచ్చిన వంశీపైడిప‌ల్లికి ధ‌న్యవాదాలు” అంటూ అంద‌రూ క‌లిసి తీసుకున్న ఫోటోను న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలోని న‌మ్ర‌త లుక్‌పై ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్ కు ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “న‌మ్ర‌తా… నువ్వెందుకు కొంచెం కూడా మేక‌ప్ వేసుకోవు. నువ్వు డిప్రెష‌న్‌లో ఉన్నావా? లేదా ఏదైనా ఫోబియాతో బాధ‌ప‌డుతున్నావా?” అంటూ గౌర‌వ్ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై స్పందించిన నమ్రత “గౌర‌వ్‌.. నీ లాంటి వ్య‌క్తులు మేక‌ప్ వేసుకున్న మ‌హిళ‌ల‌నే ఇష్డ‌ప‌డ‌తార‌నుకుంటా. ఇక‌పై, నీ ఆలోచ‌నా స‌ర‌ళికి స‌రిపోయే వాళ్ల‌నే ఫాలో అవ్వు. ఇక్క‌డి నుంచి న‌వ్వు వెళ్లిపోవ‌చ్చు. ఇది నా సిన్సియ‌ర్ రిక్వెస్ట్‌” అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Related posts