telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

అన్నిగంటలు చదివితేనే మొదటి ర్యాంక్‌:  నీట్‌ టాపర్‌ 

NEET TOPPER Kandelwal

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. రాజస్తాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించారు. మొదటి ర్యాంకు సాధించడం పట్ల రాజస్థాన్‌ విద్యార్థి నలిన్‌ ఖండేల్‌వాల్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

రోజుకు ఎనిమిది గంటలు చదివానని చెప్పాడు. తన విజయానికి కారణమైన టీచర్లకు ధన్యవాదాలు తెలిపాడు. 720 గానూ 701 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచాడు. నీట్‌ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన భవిక్‌ భన్సాల్‌ రెండో ర్యాంక్‌, ఉత్తరప్రదేశ్‌ విద్యార్థి అక్షత్‌ కౌశిక్‌ మూడో ర్యాంక్‌ దక్కించుకున్నారు.

Related posts