telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆమె గొంతు కోసి… నగ్నంగా సూట్ కేసులో

Naked body of Russian beauty

డెర్మటాలజీ, లైంగిక సంబంధాల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో స్పెషలిస్ట్ ఆమె. 24 ఏళ్ల ఆ బ్లాగర్ బ్యూటీ పేరు ఏకటరీనా కే… ఇన్‌స్టాగ్రామ్‌లో 80 వేలమంది ఫాలోవర్లున్న బ్యూటీ బ్లాగర్ ఆమె. రెండు వారాలుగా తమ కూతురు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో ఏకటెరీనా తల్లిదండ్రులకు ఏదో అనుమానం కలిగింది.

ఆమె అద్దెకుంటున్న ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి, ఒక్కసారి ఆమె ఇంటికెళ్లి చూడమన్నారు. దాంతో ఆమె ఇంటికెళ్లిన ఓనర్ ఎంతసేపు తలుపులు కొట్టినా ఏకటెరీనా తలుపులు తీయలేదు. దాంతో ఆందోళన చెందిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి, ఏకటెరీనా ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఓ రక్తపు గుర్తులున్న ఓ సూట్‌కేసు చూసి షాకయ్యారు.

దాన్ని ఓపెన్ చేసి చూస్తే.. దానిలో నగ్నంగా ఉన్న ఏకటెరీనా మృతదేహం ఉంది. ఆమె గొంతుకోసి చంపేశారని పోలీసులు గుర్తించారు. అంతేకాక ఆమె శరీరం నిండా కత్తిపోట్లున్నాయని చెప్పారు. అయితే ఈ హత్య చేసిందెవరో తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. అయితే ఇటీవలే ఆమె 52 ఏళ్ళ వ్యక్తితో డేటింగ్ ప్రారంభించిందని, గతంలో 32 ఏళ్ళ వ్యక్తితో డేటింగ్ చేసిందని, వారిద్దరి బ్రేకప్ సంగతి తెలియదని అంటున్నారు.

Related posts