telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అశ్వథ్థామ” మొదటిరోజు కలెక్షన్లు.. నాగశౌర్య గట్టిగానే రాబట్టాడు…!

Nagashourya

నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ మంచి అంచనాలతో శుక్రవారం నాడు విడులైంది. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగశౌర్య.. తొలిసారి మాస్ అండ్ రఫ్ లుక్‌లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేశారు. ఈ చిత్రానికి స్వయంగా నాగశౌర్యే కథ రాయడం విశేషం. ముంబయిలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని నాగశౌర్య చెప్పారు. సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తొలిరోజే సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. నాగశౌర్య ఈసారి గట్టిగా కొట్టాడనే చెప్పాలి. సినిమాను పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక అమెరికాలో రూ.35 లక్షలు రాబట్టిందట. ఓవర్‌సీస్‌లో రూ.75 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. మొత్తానికి సినిమా తొలిరోజు ఐదు కోట్లు రాబట్టేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అని నాగశౌర్య చెబుతూ వచ్చారు. ఏ సినిమాకు కూడా ఇంతటి ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదని అన్నారు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు. రమణ తేజ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా చోట్లు సినిమా కంటెంట్‌ని బాగా ఎలివేట్ చేసిందని ప్రేక్షకుల టాక్. మరి ఈ సినిమా ముందు ముందు మరెన్ని కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

Related posts