telugu navyamedia
సినిమా వార్తలు

ఐదేళ్లయినా మర్చిపోలేకపోతున్నాం : నాగార్జున

Nagarjuna Naga Chaitanya

ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు ఐదో వర్ధంతి. 2014, జనవరి 22న అక్కినేని నాగేశ్వర రావు దివంగతులైన విషయం తెలిసిందే. ఆయన తన సినీ కెరీర్ లో 255 చిత్రాల్లో నటించి, దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ తదితర ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పలు అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా… అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు, నటుడు నాగార్జున ట్విట్టర్ ద్వారా స్పందించారు. “మీరు మమ్మల్ని వీడి ఐదు సంవత్సరాలు అయింది. మేము ఆనందంగా ఉండేలా చేశారు మీరు. మేము మీ గురించే తలచుకుంటున్నాం. నిన్నెంతో ప్రేమిస్తున్నాం. నిన్ను మరువలేకున్నాం నాన్నా… మీ అభిమానులందరు మరియు కుటుంబం” అని ట్వీట్ చేస్తూ అక్కినేని లేని లోటు గురించి తన బాధను అభిమానులతో పంచుకున్నారు. 

Related posts