telugu navyamedia
telugu cinema news

మోడీ ట్వీట్ పై స్పందించిన నాగార్జున

Nagarjuna-with-Modi

సీనియర్ హీరో, కింగ్ నాగార్జునకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేయడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ”కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు. అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరు… ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని కోరుతున్నాను” అంటూ నాగార్జునను ఉద్దేశించి మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కేవలం నాగార్జునకు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్ , అనుష్క శర్మ, మోహన్ లాల్, అనుష్క, రణవీర్, దీపిక వంటి స్టార్ లకు, పీవీ సింధు, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీ, ధోని తదితర సినీ-రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలకు కూడా పీఎం ఆఫీస్ నుండి వచ్చిందని సమాచారం. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ పై స్పందించిన నాగార్జున ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాం. తప్పకుండా ఓటు వేసి తమ వంతు బాధ్యతాయుతంగా కృషి చేస్తామని, తనకు ట్వీట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

“సామ్ జామ్” కోసం సమంత భారీ కటౌట్… వీడియో వైరల్

vimala p

వెబ్ సిరీస్ నిర్మించనున్న నాని

vimala p

కమ్మరాజ్యంలో కడప రెడ్లు : కేఏ పాల్ పై సాంగ్… వర్మ స్టైల్లో…

vimala p