బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో “బిగ్ బాస్”. తెలుగులో తొలి సీజన్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక సీజన్-3 ఎప్పుడు మొదలవుతుంది, హోస్ట్ ఎవరు అనే దానిపై కొన్నాళ్ళుగా పలు వార్తలు విన్పిస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడని మొదట వార్తలు వచ్చినప్పటికి ఆ తర్వాత నాగార్జున, అనుష్క అంటూ పలువురు పేర్లు ఆ జాబితాలోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం “మీలో ఎవరు కోటీశ్వరుడు” వంటి రియాలిటీ షోతో ఆకట్టుకున్న నాగార్జుననే “బిగ్ బాస్-3″ని హోస్ట్ చేయనున్నాడని చెబుతున్నారు. ఇదే విషయాన్ని గత సీజన్‌లో పాల్గొన్న సామ్రాట్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేయనున్నారట. మరో వైపు “బిగ్ బాస్-3″లో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా జరుగుతుంది. జూలైలో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. కాగా నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.