telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2″లో లిప్ లాక్… మెచ్యూరిటీ పెరిగింది అంటున్న నాగ్

Nagarjuna

రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన‌ తాజా చిత్రం “మన్మథుడు-2”. ఈ చిత్రంలో నాగ్‌ సరసన రకుల్ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజ‌ర్‌లు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో హీరోయిన్లు స‌మంత‌, కీర్తి సురేష్ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించనున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్‌లో కూడా లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను చూపించారు. అయితే పేరుతో త‌ప్ప గ‌తంలో వ‌చ్చిన `మ‌న్మ‌థుడు`కు ఈ సినిమాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని తాజాగా జ‌రిగిన “మ‌న్మ‌థుడు-2” ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మంలో నాగార్జున చెప్పారు. `గ‌తంలో వ‌చ్చిన `మ‌న్మ‌థుడు` సినిమాకు ఇది సీక్వెల్ కాదు. దాని క‌థ‌కు, దీనికి ఎలాంటి సంబంధ‌మూ లేదు. ఇది ఒక ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌. ఆ సినిమా హ‌క్కులు తీసుకుని ఈ సినిమాను రూపొందించామ‌`ని నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలోనే ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. మీరు నా గీతాంజలి చిత్రం చూశారా … ఆ చిత్రంలో రెండున్నర నిమిషం పాటు ముద్దు సన్నివేశం ఉంటుందని నాగార్జున తెలిపాడు. అప్పుడు మీరు యువకుడు. కానీ ఇప్పుడు మీ వయసు పెరిగిందిగా అని విలేఖరి ప్రశ్నించాడు. అప్పటికి ఇప్పటికి ముద్దు సన్నివేశాల్లో నటించడంలో మెచ్యూరిటీ పెరిగింది అంటూ నాగార్జున సరదాగా సమాధానం ఇచ్చాడు.

Related posts