telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

లవ్‌స్టోరీ..శేఖర్‌ కమ్ముల.. సాయిపల్లవి.. నాగచైతన్య..

nagachaitanya-saipallavi movie name as love story

నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి పల్లవి లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. ప్రచార చిత్రంలో సాయిపల్లవి.. చైతన్య చొక్కాను పట్టుకుని భావోద్వేగానికి గురౌతూ కనిపించారు. ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు.

‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. వేసవిలో కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరోపక్క వరుస హిట్లతో ఉన్న చైతన్య ఎంచుకున్న కథ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Related posts