telugu navyamedia
culture news political telugu cinema news Uncategorized

సినీ నటుడు నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు!

nagababu

గాంధీని చంపిన గాడ్సే ఒక నిజమైన దేశభక్తుడని సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గాడ్సేను తాను సమర్థించలేదని, ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియాలనే తాను ఇలా వ్యాఖ్యానించానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శకుల ఆగ్రహం తగ్గలేదు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాగబాబుపై హైద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ నేత మానవతారాయ్ ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించిన నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related posts

ఐసీసీ రాజ్యాంగ ఉల్లంఘన కింద.. జింబాబ్వే టీం పై వేటు…

vimala p

వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ ఛాలెంజ్ … కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా..!

vimala p

సచిన్ పైలట్ వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట

vimala p