telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగబాబు కామెంట్-3: కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి

nagababu1

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన కామెంట్ టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. నాగబాబు, బాలయ్యను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా “కామెంట్ నంబర్ -2. ఏబీఎన్ చానల్ లో ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూ” అంటూ నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.

“పవన్ కళ్యాణ్ ఇట్లా కామెంట్ చేశాడు మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా, పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కరెక్ట్‌ గా మాట్లాడలేదు అంటూ మీరు కామెంట్ చేయవచ్చు. మీరు విమర్శించవచ్చు. ఆ… అవన్నీ మాకవసరం లేదు. మాకు మేమే హీరోలం, మాకు మేమే సూపర్ స్టార్లం… అంటే… మీకు మీరే సూపర్ స్టార్లు. మాకు అబ్జెక్షన్ లేదు. కానీ మిగతావాళ్లు కాదా? మీరేనా సూపర్ స్టార్స్? మీరేనా గొప్పనటులు. పవన్ కళ్యాణ్ కాదా? అసలు ఈ టైప్ ఆఫ్ కామెంట్ ఏంటి?

మాకు మేమే స్టార్లం. మాకు మేమే సూపర్ స్టార్లం. మాకు మేమే హీరోలం ఏంటి? దీన్ని కామెంట్ చేయడం కుదరదా మాకు? చేతకాదా మాకు? మేం కౌంటర్ చేయలేమా? అయినా ఎందుకులే చూద్దాం… చూద్దాం… చూద్దాం… అని చాలా ఓపికగా వెయిట్ చేశాం. సో… ఇక్కడ సూపర్ స్టార్స్ ఒక్కళ్లే కాదు. చాలా మంది ఉంటారు స్టార్స్ ఇక్కడ. ప్రతి వాళ్లూ స్టార్సే. పేరున్న ప్రతి వాళ్లూ స్టార్సే. చాలా మంది స్టార్స్ ఉన్నారు. మహేష్ బాబు అనబడే స్టార్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక స్టార్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనే స్టార్ ఉన్నాడు. మెగాస్టార్, సూపర్ స్టార్ కృష్ణగారు ఉన్నారు. చాలా మంది స్టార్స్ ఉన్నారు. మీకు మీరు స్టార్ అని చెప్పుకోండి ఫరవాలేదు. ఎవరినో హీరోను చేయడం ఎందుకు? మీరేమీ ఎవ్వరినీ హీరోలను చేయక్కర్లేదు. మీరెవర్ని హీరోలను చేస్తారు? జనాలు హీరోలను చేస్తారు. జనాలకు నచ్చితే హీరోలవుతారు. జనాలు మెచ్చుకుంటే స్టార్స్ అవుతారు. దీనికి కూడా మేము కామెంట్ చేయవచ్చు. అయినా కూడా మేము కామ్‌గానే ఉన్నాం. దీనికి కూడా మేము కామెంట్ చేయలేదు” అంటూ ఓ వీడియోను నాగబాబు విడుదల చేశారు.

ఇక “కామెంట్ నంబర్ – 3 : అమితాబచ్చన్ ఏం పీకాడు ? చిరంజీవి ఏం అయింది ? మేము వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు..” అంటూ గతంలో బాలయ్య చేసిన కామెంట్ పై మరో వీడియోను విడుదల చేశారు. “ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో… అమితాబ్ బచ్చన్ కూడా అంతే గొప్ప నటుడు… ఆయన మీ తండ్రిలాంటి వారు… అలాంటి గొప్ప నటుడిని పట్టుకుని అలా మాట్లాడడం తప్పు… మధ్యలో చిరంజీవి పేరు ఎందుకు వచ్చింది ? రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు… ఒక్కసారి పరాజయం పాలయ్యామని… ఎప్పుడూ పరాజయాన్ని చవిచూడము… ఒక్కసారి సక్సెస్ వచ్చిందని… ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉండము… మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటూ మాట్లాడడం కాదు… పెద్దాయన ఎన్టీఆర్ ను మీ బావ వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది మీ బ్లడ్, బ్రీడ్…” అంటూ ఈ వీడియోలో ప్రశ్నించారు.
ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts