telugu navyamedia
andhra news political Telangana telugu cinema news trending

గ్లాసు గుర్తుకే ఓటు వేయండి… : నాగబాబు

nagababu started campaign to janasena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ గుర్తు తోనే ఆ పార్టీ రాబోయే ఎన్నికలలో పోటీ చేయనుంది. ఈ విషయం తెలిసినదే. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పార్టీ పై పెద్దగా స్పందించని మెగా కుటుంబం, గుర్తు కేటాయించగానే ‘గ్లాసు గుర్తుకు ఓటు వేయండి’ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా నాగబాబు, వరుణ్ తేజ్ లు కూడా జనసేనకు భారీగా విరాళాలు కూడా ఇచ్చారు.

ఇక నాగబాబు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి అంటూ ప్రచారంలో మెగా కుటుంబం తరుపున, జనసేన కోసం ముందుకు వచ్చారు. జనంలో తిరుగుతూ, వారికి ఏదో చేయాలనీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే జనసేన ఆవిర్భవించింది. ఇన్నాళ్లయినా ఆ పార్టీ కోసం, తమ్ముడి కోసం ఏమి చేయలేకపోతున్నాము అనే దిగులు ఉండేది. అదే ప్రస్తావించేవాడు వరుణ్ కూడా. ఎవరి బిజీ లో వారు ఉండటం వలన కుదరలేదు కానీ, లేదంటే మాకు తమ్ముడితో కలిసి పనిచేయాలని ఉందని నాగబాబు తన మనసులో భావాలను పంచుకున్నారు. ఇక మీదట కూడా జనసేనకు తమవైపు నుండి అన్నివిధాలా అందాల్సిన మద్దతు అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు.

ఇక గ్లాసు గుర్తు గురించి ఆయన మాట్లాడుతూ, ఈ గ్లాసు సామాన్యుడికి చాలా దగ్గరగా ఉండే వస్తువు. దానిని జనసేనకు కేటాయించడం సరైనది, పవన్ ఆశలకు ఈ గుర్తే అర్ధం పడుతుంది. పవన్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఎందరికో మంచి చేస్తుందని ఆయన అన్నారు. మా కుటుంబం లోనుండి తమ్ముడు సామజిక బాధ్యతను ఇంతగా భుజాన వేసుకోవడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. అంతలా చేస్తున్న పవన్ కు ఏదో ఒకటి చేయాలనీ మొదటి నుండి ఉన్నా, తాజాగా చేసిన ఆర్థిక సాయం తప్ప వేరేవిధంగా ఏమీ చేయలేని స్థితి అని ఆయన అన్నారు. దీనిపై పవన్ ట్వీట్ ద్వారా సమాధానం ఇవ్వడం సంతోషమని, జనసేన ద్వారా తమ్ముడు ప్రజలకు చేయాలి అనుకున్నవన్నీ చేయాలనీ ప్రోత్సహిస్తూ, ఇన్నాళ్లుగా ఏమి చేయలేని అసంతృప్తి ఉండేదని, ఇప్పుడే కాస్త మనసుకు హాయిగా ఉందని నాగబాబు అన్నారు. జనసేనకు వరుణ్ కోటి, నాగబాబు 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. తనకు క్రిస్మస్ కు బహుమతి ఇచ్చినందుకు పవన్ వారిద్దరికీ కృతఙ్ఞతలు తెలిపారు. త్వరలో వారిని ప్రత్యక్షంగా కలుస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం యూరప్ టూర్ లో పవన్ ఉన్నాడు.

Related posts

రైతు సమస్యలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత: పిల్లి సుభాష్

vimala p

మహర్షి : “పాలపిట్ట” మేకింగ్ వీడియో

vimala p

అక్కడ జైళ్లే.. వాళ్లకు వృద్ధాశ్రమాలు..

vimala p