telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘విశ్వాసం లేని నా కుక్క’ అంటూ వీడియో షేర్ చేసిన నాగబాబు

Nagababu

మెగా బ్రదర్ నాగబాబు ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ‘విశ్వాసం లేని కుక్క’ అంటూ తన ఇంట్లో జరిగిన ఆసక్తికర సన్నివేశాన్ని వీడియో రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ వీడియోలో తాను 2006 నుంచి ఓ కుక్కను పెంచుకుంటూ, దానికి పీకూ అని పేరు పెట్టుకున్నానని తెలిపారు నాగబాబు. “కుక్కల గురించి ఎన్నో సాహసగాధలు వినే ఉంటాము. మా పీకూ (కుక్క) కూడా అలాంటి కోవకు చెందినదే అని ఇన్నాళ్లు అనుకున్నా. మొన్న ఆవిడకు పాములంటే భయం అనడంతో.. ఆ భయం పోగొట్టడానికి రబ్బరు పాములు తీసుకువచ్చి.. తనతో పట్టించా…” అంటూ నాగబాబు వీడియోను షేర్ చేశారు. ఆ పాముని చూడగానే నాగబాబు భార్య పద్మతో పాటు ఆ కుక్క కూడా లోపలికి పారిపోయింది.

Related posts