telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నరసాపురం పార్లమెంటుకు నాగబాబు ?

nagababu from kakinada as mp candidate
వచ్చే ఎన్నికల్లో నాగ బాబు జనసేన పార్టీ తరుపున నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారా ? అవుననని అంటున్నారు నాగబాబు సన్నిహితులు . పవన్ కళ్యాణ్ అంటే నాగబాబుకు ఎంతో అభిమానం , గౌరవం . తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత నాగ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా  పరోక్షంగా మద్దతు ఇస్తూనే వున్నాడు . గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేస్తూ తనదైన  శైలిలో యూ ట్యూబ్ లో వీడియోలు  వదులుతూనే వున్నాడు . 
ఇక  నందమూరి బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ కూడా రాజకీయ దుమారం రేపాయి. .కానీ వాటిపై చిరంజీవి ఎప్పుడు స్పందించలేదు . అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు తెలిసే నాగ బాబు రాజకీయ విమర్శలు చెయ్యడం మొదలు పెట్టారని అర్ధమవుతుంది . ఆ మధ్య జనసేన పార్టీకి తానూ , తన కుమారుడు వరుణ్ తేజ్ కోటి పాతిక  లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు . ఒకప్పుడు ఆర్ధికంగా పవన్ తనని నిలబెట్టాడన్న కృతజ్ఞత కావచ్చు , లేదా జనసేన పార్టీ మీదా అభిమానం కావచ్చు . ఎవరూఊహించని విధంగా  విరాళం దజేశాడు . ఇక ఈటీవి  షో తప్ప నాగ బాబు ఖాళీగానే ఉంటున్నాడు .
అందుకే ఇటీవల తన పేరుతో యు ట్యూబ్ ఛానల్ పెట్టి రాజకీయ విమర్శలు ఎక్కువ చేస్తున్నాడు . ఈ నేపథ్యంలో నాగబాబును నరసాపురం నుంచి పార్లమెంట్ స్థానాన్ని నిలబెట్టాలని ఆలోచన పవన్ కళ్యాణ్కు ఉన్నట్టు తెలిసింది . నరసాపురంలో కాపులు , రాజులు ఎక్కువ. అందుకే ఇక్కడ కాపు లేదా రాజులను నిలబెట్టాలని పార్టీలు భావిస్తాయి . నాగబాబు అయితే నరసాపురంలో తేలిగ్గా నెగ్గుతాడని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది . తమ కుటుంబమంటే అందరికీ గౌరవం ఉందని , నాగ బాబుకు  కూడా నిర్మాతగా , నటుడుగా పాపులారిటీ వుంది. .
రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ తేజ, అల్లు అర్జున్  వచ్చి నాగ బాబు తరుపున ప్రచారం నిర్వహిస్త్తారు . కాబట్టి ఏరకంగా చూసినా  నాగ బాబు గెలిచే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నాడట . అయితే నాగ బాబు  అన్నయ్య చిరంజీవి ఆజ్ఞ కొసంఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది . చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నరసాపురం బరిలో దిగిపోతాడు . ఇప్పటికే  అమలాపురం నుంచి డి ఎమ్ ఆర్ శేఖర్,  రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ ను మాత్రమే  పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు . నాగబాబు విషయంలో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం వుంది 

Related posts