telugu navyamedia
telugu cinema news trending

ఆస్తులు అమ్మినా… అప్పులు తీరవు : నాగబాబు

Nagababu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “ఆరెంజ్” చిత్రం ఎంతటి పరాజయం పాలైందో అందరికీ తెలిసిన విషయమే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఆ సినిమాకు నిర్మతగా వ్యవహరించిన నాగబాబు ఊహించలేనంతగా నష్టపోయారు. అయితే ఆ అప్పులు తీరడానికి తన అన్నదమ్ములు సహాయం చేశారన్న విషయాన్ని చాలాసార్లు వెల్లడించారు నాగబాబు. అయితే తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… ”ఆరెంజ్ సినిమా విడుదలైన తరువాత నేను ఎంతగా నష్టపోయానో తెలుసుకొని షాక్ అయ్యాను. నా ఆస్తులన్నీ అమ్మినా… ఆ అప్పులు తీరవు… అనే విషయం నాకు అర్ధమైంది. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోవడమే దానికి కారణమని తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో నా సోదరులు ఇద్దరూ నాకు సపోర్ట్ గా నిలిచారు. ఆ సమయంలోనే బుల్లితెరపై దృష్టి పెట్టాను. జబర్దస్త్ షో, టీవీ సీరియళ్ళ ద్వారా పేరు, డబ్బు వచ్చాయి. నాకు ఎదురైన సమస్యలతో నేను చాలా నేర్చుకున్నాను. కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా పోరాడాలనే విషయాన్ని గ్రహించాను. నాలో ధైర్యం నింపి, నన్ను ఆదుకున్న నా సోదరులంటే నాకు ప్రాణం” అంటూ ఆ అప్పుల గురించి చెప్పుకొచ్చారు.

Related posts

బుర్రకథ … విడుదలతేది ఖరారు..

vimala p

ప్రపంచ కప్ : .. భారత్ విజయం.. గెలవటం తెలిసిందే..

vimala p

మందేసి చిందేస్తే.. జైలుకే…

vimala p