telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

లోకేష్ చిన్నపిల్లాడే… నాగబాబు సెటైర్స్

Nagababu

ఇటీవల బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మెగా బ్రదర్ నాగబాబు. తాను “మై ఛానల్ నా ఇష్టం” పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టానని, ఇకపై ఈ వేదిక నుంచే తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు నాగబాబు. చిన్న పిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదనే ఓ పాటను చిన్నప్పుడు వినేవాళ్లమని, నిజంగానే పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని చెప్పుకొచ్చారు.

గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో “ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే” అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియో ద్వారా మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. “ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ… ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదు” అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి.

Related posts