telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది ‘పోలీసు వారి హెచ్చరిక’ అంటోన్న నాగశౌర్య

ఊహలుగుసగుస లాడే అంటూ అందరిని ఊహల్లో తేల్చేసిన హీరో నాగశౌర్య. తన మొదటి సినిమాతోనే పక్కింటి అబ్బాయిలా కనిపించి అందరి ఆదరణను పొందాడు. ఆ తరువాత చలో అని అందరిని థియేటర్ల బాట పట్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో మూవీ టైటిల్‌ను ప్రకటించాడు నాగశౌర్య. “పోలీసు వారి హెచ్చరిక” అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో నాగశౌర్య వస్తున్నాడు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కేపీ రాజేంద్ర ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక మహేష్‌ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాగశౌర్య బర్త్‌ డే సందర్భంగా గురువారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా..నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. 

Related posts