telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ రీమేక్ కు అక్కినేని హీరో గ్రీన్ సిగ్నల్ ?

Akkineni

అక్కినేని నాగ‌చైత‌న్య ఈ ఏడాది “మ‌జిలీ”తో హిట్ కొట్టిన చైత‌న్య‌ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేసింది. ఎమిగోస్ క్రియేషన్స్ స‌మర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో చైత‌న్య మ‌రో సినిమా చేసే అవ‌శాలున్నాయి. దీనికి సంబంధించిన తుది ద‌శ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే త్వ‌ర‌లోనే చైత‌న్య ఓ బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స‌మాచారం మేర నిర్మాత దిల్‌రాజు బాలీవుడ్ చిత్రం “బ‌దాయి హో” సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దిల్‌రాజు, బోనీక‌పూర్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో చైత‌న్య న‌టించ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మ‌రి సోష‌ల్‌మీడియాలో విన‌ప‌డుతోన్న ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే చైతన్య స్పందించాల్సిందే.

Related posts