telugu navyamedia
సినిమా వార్తలు

మరో “శంకరాభరణం” అనుకున్నాము… కానీ అట్టర్ ఫ్లాఫ్ : నాగబాబు

Nagababu

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు “నా యిష్టం” అంటూ యూట్యూబ్ లో తన ఛానల్ ద్వారా పలు వీడియోలతో రాజకీయ నాయకులకు కౌంటర్లు, ఆస‌క్తిక‌రమైన విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు పొలిటిక‌ల్ కౌంటర్లు వేసిన నాగబాబు తాజాగా సినిమాల విషయమై మాట్లాడారు. మొదటిసారి నిర్మాత‌గా తాను నిర్మించిన “రుద్ర‌వీణ‌” సినిమాకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. బాల‌చంద‌ర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఊహించ‌ని ప‌రాజ‌యాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

“అప్ప‌టివ‌రకు చ‌దువు మీద శ్ర‌ద్ధ పెట్టిన నేను అన్న‌య్య ప్రోత్సాహంతో “రుద్ర‌వీణ‌” చిత్రానికి నిర్మాత‌గా మారాను. అప్ప‌ట్లోనే ఆ సినిమాకు దాదాపు 90 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టాం. నిజానికి అప్ప‌టికి అది భారీ బ‌డ్జెట్‌. ఏడాదిన్న‌ర‌పాటు షూటింగ్ జ‌రిగింది. పాటలు సూప‌ర్‌ హిట్ అయ్యాయి. “శంక‌రాభ‌ర‌ణం” స్థాయిలో సినిమా ఆడుతుంద‌నుకున్నాం. అయితే ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యి నిరాశను మిగిల్చింది. మంచి సినిమా పోయింద‌ని బాధ‌ప‌డ్డాం. దాదాపు 15 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం వ‌చ్చింది. అయితే “రుద్రవీణ”కు జాతీయ అవార్డులు రావ‌డం కొంత సంతృప్తిని కలిగించింది” అంటూ నాగబాబు ఈ వీడియోలో తెలిపారు.

Related posts