telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి: పవన్ కల్యాణ్

Naga Babu,Janasena,Narsapura MP
ప్రముఖ నటుడు నాగబాబు జనసేన బుధవారం జనసేన పార్టీలో చేరారు. అన్న నాగబాబుకు కండువా కప్పి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకున్న రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే మొదలయిందని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలోకి దింపుతున్నాని తెలిపారు. 
నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు.అందుకే నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన తరఫున నాగబాబును బరిలోకి  దించుతున్నామని ప్రకటించారు. అన్నింటిని వదులుకుని తన పిలుపు మేరకు అన్న నాగబాబు రాజకీయాల్లోకి వచ్చారన్నారని చెప్పారు.

Related posts