• Home
  • వార్తలు
  • నాదెండ్ల మనోహర్…నేడు జనసేనలోకి…కాంగ్రెస్ కి రాజీనామా..
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

నాదెండ్ల మనోహర్…నేడు జనసేనలోకి…కాంగ్రెస్ కి రాజీనామా..

nadendla manohar into janasena party

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేడు కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పుడే జనసేనలో చేరిక గురించి చర్చించారు. నేటి రాజీనామాతో జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల మనోహర్ ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనితో ఆ పార్టీలో నాదెండ్ల మనోహర్ చేరిక, సీటు ఖాయం అయినట్టే తెలుస్తుంది. నేటి సాయంత్రం పవన్ కళ్యాణ్ తో కలిసి మనోహర్ తిరుపతి వెళ్లనున్నారు. స్వామి దర్శనం అనంతరం జనసేన లో చేరనున్నారు.

మనోహర్ 2004లో తొలిసారి తెనాలి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2009లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వై.ఎస్.ఆర్ మరణంతో తొలుత రోశయ్య, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 2011లో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. 2014లో మనోహర్ కూడా ఓటమి పాలే అయ్యారు. మనోహర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు.

Related posts

“థగ్స్ ఆఫ్ హిందుస్తాన్”పై రాజమౌళి ట్వీట్… అమీర్ కొంచం తేడా అంట..!?

vimala t

రెచ్చిపోయిన మావోలు… భయాందోళనలో ప్రజలు

nagaraj chanti

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..బీజేపీ నేతల నిరసన

madhu

Leave a Comment