telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల

Nadendla baskar rao

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నేడు కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షాను కలిసి కమలం పార్టీలో చేరారు. నాదెండ్లకు కాషాయ కండువా కప్పి అమిత్ షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.1984లో ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

Related posts