telugu navyamedia
సినిమా వార్తలు

మజిలీ : “నా గుండెల్లో” సాంగ్ మేకింగ్ వీడియో

majili movie on april 5th

నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం “మజిలీ”. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని ‘‘నా గుండెల్లో’’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ పాడిన యాజిన్ నైజర్, నిఖితాగాంధీని, పలు షూటింగ్ లొకేషన్స్‌ని చూపిస్తూ ఈ వీడియోను కట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఇటీవలే ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ కు కొన్ని గంటల్లోనే 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో సోషల్ మీడియాలో దూసుకుపోవడం విశేషం. దీంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రేక్షకులు కూడా వెండితెరపై సమంత, నాగచైతన్యను చూడడానికి ఆతృతగా ఉన్నారు.

Related posts