telugu navyamedia
సినిమా వార్తలు

నా చెలి..

vedukolu poetry corner
నా ప్రేమకొలనులో
గుబాలించే కలువ
నా హృదయం దోచిన
అమూల్యమైన మగువ
వలపుల వనంలోన
విరిసిన మల్లె పువ్వు
వదన సదనంలోన
వెలుగేటి చిరునవ్వు
పొంగు పరువాలతో
పండుగే చేస్తుంది
చెంగుచెంగున చెలి
చిందులే వేస్తుంది
చూపుల చెరసాలలో
బందీని చేస్తుంది
ప్రేమలొలుకు మదిలో
స్థానమే ఇస్తుంది
–గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts