telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అలర్ట్ : క్లాత్ తో చేసిన మాస్కులు వాడితే ప్రమాదమే!

mask corona

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.  అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ ను ఎలా అదుపు చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. భౌతిక దూరం, మాస్క్ లు ధరించడమే మార్గమమని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది సాధారణ మాస్కులు, క్లాత్ తో తయారు చేసిన మాస్కులు వాడుతున్నారు. క్లాత్ తో తయారు చేసిన మాస్కుల కంటే ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు వాడటం చాలా మంచిదని అమెరికా మేరీలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫాహిమ్ యూ నస్ పేర్కొన్నారు. రెండు ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు కొని,,, ఒక్కోరోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్ లో ఉంచి మరుసటి రోజు వాడాలని తెలిపారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చని పేర్కొన్నారు. క్లాత్ తో చేసిన మాస్కులు ధరించ వద్దని హెచ్చరించారు. 

Related posts