telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా పెళ్ళి డేట్ ప్రతి మూడు వారాలకు మారుతోంది… అలియా భట్

Alia

బాలీవుడ్ నటులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఎప్పటి నుంచో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది రణ్‌బీర్, ఆలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగేందుకు ఆలియా ఇంటికి వెళ్లారట. ఆ సమయంలో రణ్‌బీర్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారట. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్, ఆలియా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి తరచూ విహారయాత్రలకు కలిసి వెళ్లడం, పార్టీలకు వెళ్లడం వంటివి చేస్తూ కనిపించారు. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. దీని గురించి మీడియా వర్గాలు ఆలియాను ప్రశ్నించగా.. “ప్రస్తుతం నా పెళ్లి మీద ఏ రూమర్ ఉందో తెలీదు. ప్రతి మూడు వారాలకు ఓసారి నా పెళ్లి డేటు మారుతోంది. కానీ ఇది నాకు చాలా నచ్చింది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నాకు ఈ రూమర్స్ నుంచి కేవలం వినోదం మాత్రమే లభిస్తోంది” అన్నారు.

Related posts