telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

తెలంగాణ యాస, భాషలో లగ్గం కార్డు.. ఫోటోలు వైరల్

యుట్యూబ్‌లో “మై విలేజ్‌ షో” ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలుసు. బిగ్‌బాస్‌ ఫేం గంగవ్వతో కలిసి రాజు, చందు చేసే వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అయితే.. మై విలేజ్‌ షో లాగే… కొత్తగా తన పెళ్లి పత్రికను తాయారు చేయించాడు చందు. ఈ పెళ్లి పత్రికను చందు తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో… అది కాస్త వైరలై… సోషల్‌ మీడియానే ఊపేస్తోంది. చాలా వెరైటీగా ఉందని నెటిజన్లు చందును తెగ పొగిడేస్తున్నారు. అసలు ఈ పత్రిక అంతగా వైరల్‌ కావడానికి కారణం తెలంగాణ యాస, భాష. అవును ఈ పత్రిక మొత్తం తెలంగాణ యాసతో నింపేశాడు చందు. దీంతో అందరూ ఈ పత్రికకు ఫిదా అయిపోయారు. ఈ పత్రికలో అసలు ఏముందంటే… “లగ్గం యాడనో ఎర్కన”, బువ్వ, ఆశీర్వదించేవారు స్థానంలో “పిలిశెటోల్లు”, ఐతారం గోలె, అంబటాల్లకు 11: 37 గొట్టంగ, మా సిన్న పిలగాడు, లగ్గం పిలుపు” వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దారు. మొత్తానికి ఈ పత్రిక తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది. బహుశా పూర్తి తెలంగాణ యాసలో మొదట కొట్టించిన శుభలేఖ ఇదేనేమో. ఇది ఇలా ఉండగా.. ఈ పత్రికకు తెలంగాణ యాసలోనే నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related posts