telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాఘవ లారెన్స్ ట్రస్ట్‌లోని చిన్నారులకు నెగెటివ్

Lawrence

ఇటీవల కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ట్రస్ట్‌లోని చిన్నారులకు కోవిడ్ 19 పాజిటివ్ రాగా, అందరినీ క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా లారెన్స్ ట్రస్ట్ చిన్నారులు అందరికీ నెగిటివ్ వచ్చినట్లుగానూ, వారందరూ తిరిగి ట్రస్ట్‌కు వచ్చేసినట్లుగా లారెన్స్ ట్వీట్ చేశారు. “స్నేహితులు, అభిమానులకు నమస్కారం. అందరితో ఓ మంచి వార్త పంచుకుంటున్నాను. కరోనా వైరస్ చికిత్స పొందుతున్న నా ట్రస్ట్‌లోని చిన్నారులు అందరూ తిరిగి వచ్చేశారు. వారందరికీ రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం…” అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts