telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ముస్లిం బుడ్డోడికి నరేంద్ర మోదీ పేరు

ప్రధాని మోదీ పేరును తన బిడ్డకు నామకరణం చేయాలని ఓ ముస్లిం మహిళ నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ పర్సాపూర్‌లోని మహరౌర్ గ్రామంలో మైనాజ్ బేగంకు 23వ తేదీన మగబిడ్డ జన్మించాడు. ఆ బుడ్డోడికి ఏం పేరు పెట్టాలని ఆలోచించింది. అదే రోజు మోదీ భారీ విజయాన్ని సాధించడంతో ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో భర్త, కుటుంబ సభ్యులు వారించినప్పటికీ, అందరినీ ఒప్పించింది.

మొత్తానికి ఆ పిల్లోడికి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని నామకరణం చేసి మోదీ పట్ల ఉన్న తనకున్న అభిమానాన్ని మైనాజ్ బేగం చాటుకుంది. ఇక ఈ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఓ ఆఫిడవిట్‌ను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మైనాజ్ ప్రశంసలు కురిపించింది. దేశాభివృద్ధి కోసం మోదీ పాటుపడుతున్నారని తెలిపింది. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయని ఆమె అన్నారు.

Related posts