telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

ట్రిపుల్ తలాక్ పై .. సుప్రీమ్ కోర్టుకు వెళతాం .. : ముస్లిం పర్సనల్ లా బోర్డు

muslim union strongly disagree with triple talaq bill

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ట్రిపుల్ తలాక్ బిల్లు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన కొద్ది సేపటికే బోర్డు స్పందించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ‘న్యాయం’ కోసం తాము సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. ముస్లిం కుటుంబాలను విడగొట్టటమే బిల్లు ముఖ్య ఉద్దేశమని లా బోర్డు అభిప్రాయ పడింది.

స్వభావరీత్యా ఇది నిరంకుశ బిల్లు అని, ముస్లిం మగవాళ్లను లక్ష్యంగా చేసుకున్నదని ఎఐఎండబ్ల్యూపీఎల్‌బీ గతంలోనూ తీవ్రంగా వ్యతిరేకించింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలోనూ ఇవాళ సాయంత్రం ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు పడ్డాయి. ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే చట్టం రూపు సంతరించుకుంటుంది.

Related posts