telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో తీరని విషాదం..

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ను కోల్పోయింది. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు ఇస్సాక్‌ థామస్‌ కొట్టుకపల్లి (72) గుండెపోటు కారణంగా చెన్నైలో మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. “మన్ను” మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన థామస్‌…. మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాలకు సంగీతం అందించారు. కొడైకెనాల్‌లోని అమెరికన్‌ టీచర్స్‌ స్కూల్‌ నుంచి సంగీత కోర్సు పూర్తి చేసిన తర్వాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు. అంతేకాదు..సినీ పరిశ్రమలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన థామస్‌ జాతీయ, రాష్ట్ర అవార్డులను కూడా సాధించారు. కాగా.. థామస్‌ మృతిపై సినీ ఇండస్ట్రీకి చెందిన పలుగురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related posts