telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

మారని బంగ్లా ఆటగాళ్ల తీరు…

శ్రీలకంతో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఓ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ పరుగు తీయకుండా అడ్డురావాలని బౌలర్‌కు సూచిస్తూ ముష్పికర్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటౌంది. ముష్ఫికర్ రహీర్(125) సెంచరీతో రాణించాడు. అనంతరం శ్రీలంక ఇన్నింగ్స్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఈ లక్ష్యచేధనలో శ్రీలంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణ తిలక, పాతుమ్ నిస్సాంక కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇక మెహ్‌దీ హసన్ వేసిన 10వ ఓవర్‌లో ఐదో బంతిని గుణ తిలక డిఫెండ్ చేశాడు. బంతి కోసం మెహ్‌దీ హసన్ డైవ్ చేయగా.. నాన్‌స్ట్రైకర్ పాతుమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే కీపర్ ముష్ఫికర్ పరుగు తీయకుండా అడ్డురావాలని మెహ్‌దీ హసన్‌కు సూచించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముష్ఫికర్ ఏందీ తొండాట అంటూ నిలదీస్తున్నారు. ఇక ప్రత్యర్థుల పట్ల ముష్ఫికర్ దూకుడుగా, దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను చాలా సార్లు క్రీడా స్పూర్తి విరుద్దంగా ప్రవర్తించాడు.

Related posts