telugu navyamedia
రాజకీయ వార్తలు

మళ్ళీ రాజకీయాలలోకి .. ముషారఫ్‌ ..

musharraf again into politics soon

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మళ్లీ రాజకీయ రానున్నారు. తాను స్థాపించిన పార్టీ ఆల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఏఎంపీఎల్‌) 9వ వార్షికోత్సవం రోజైన అక్టోబరు 6న ఆయన రాజకీయ పునఃప్రవేశ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉంటుందని పర్వేజ్‌ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే ముషారఫ్‌ ముఖ్యమైన రాజకీయ ప్రకటనలు కూడా చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్‌ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆరోగ్య కారణాల వల్ల ఏడాదిగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. 76 ఏళ్ల ముషారఫ్‌ ఏపీఎంఎల్‌ పార్టీని 2010లో స్థాపించారు.

ఆయన అమిలోయిడిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఏపీఎంఎల్‌ కార్యదర్శి మెహ్రీన్‌ మలిక్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వార్తా సంస్థతో అన్నారు. ఈ ఆరోగ్య సమస్యపై గత నెలలో లండన్‌లోని ఓ ఆస్పత్రిలో 12 రోజులపాటు చికిత్స పొందారని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడడంతో ముషారఫ్‌ దుబాయ్‌లోని తన ఇంటికి చేరుకున్నారని, పార్టీ నాయకులతో సమావేశం కూడా నిర్వహించారని చెప్పారు. ఇకపై వైద్యుల పర్యవేక్షణలోనే తన రాజకీయ కార్యకలాపాలన్నీ సాగుతాయని అన్నారు. ఆయన సూచనలతోనే ఏఎంపీఎల్‌ నాయకులు నడుచుకుంటారని తెలిపారు.

Related posts