telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైకోర్టులో ఉత్తర్వులతో వర్మ ‘మర్డర్’కు ఊరట

murder

సంచలన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన క‌ల్పిత చిత్రం “మ‌ర్డ‌ర్”. వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ధియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ చిత్రబృందం అనుకుంది. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ ‌అమృతా ప్రణయ్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టుకెక్కారు. ఈ సినిమాలో త‌న పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గ‌త నెల 29న ఆ సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌పై సూట్ ఫైల్ చేశారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ వర్మ సినిమాని నిర్మించడాని అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ‘మర్డర్’ చిత్ర దర్శకనిర్మాతలు ప్రణయ్ తండ్రి బాలస్వామి వేసిన పిటీషన్ పై హైకోర్టులో స్టే కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణ లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్ట్ ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో వర్మ ‘మర్డర్ ‘కు ఊరట లభించింది.

Related posts