telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్యకు ఇల్లు ఇవ్వని మురళీ మోహన్

nagachitanya

పెళ్లి తర్వాత ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకోవాలని తిరుగుతున్న సమయంలో చాలా ఇళ్లు చూసిన చైతూకు ఒక్కటి కూడా నచ్చలేదు. అలాంటి సమయంలో మురళీ మోహన్ ఇల్లు చూసాడు అది ఆయనకు బాగా నచ్చేసింది. వెంటనే వెళ్లి అంకుల్ ఇది నాకు కావాలని చైతూ అడిగేసాడు. అయితే మురళీ మోహన్ మాత్రం ఇది అమ్మడానికి కాదు బాబు.. తనకు, తన కొడుకు, తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా కట్టుకున్నామని చెప్పాడు. అయితే ఇల్లు బాగా నచ్చడంతో వెంటనే ఇంటికి వెళ్లి నాగార్జునకు విషయం చెప్పాడు చైతూ. అంతే వెంటనే నాగ్ రంగంలోకి దిగాడు. సిటీలో ఎన్నో ఇల్లు చూసిన చైతూకు మీ ఇల్లు మాత్రమే బాగా నచ్చింది.. ఓసారి చూడండి మురళీ మోహన్ గారూ అంటూ నాగ్ చెప్పడంతో ఆయన కూడా మనసు మార్చుకున్నాడు. నాగార్జున కుటుంబంతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఇద్దరం కలిసి చాలా సినిమాలు కూడా చేసామని చెప్పాడు మురళీ మోహన్. . చైతూ ఇష్టాన్ని కాదనలేక.. తన కొడుకు మరో ఇంటికి మారిపోయాడని.. దాంతో తన కొడుకు కోసం కట్టిన ఫ్లాట్‌ను చైతూకు ఇచ్చేసానని చెప్పాడు మురళీ మోహన్. 14వ ఫ్లోర్‌లో పూర్తిగా సౌకర్యాలతో ఉండే ఈ ఇంటిని మనసు పడి మరీ కొనుక్కున్నాడు చైతూ. ప్రస్తుతం అక్కడే సమంతతో కలిసి ఉంటున్నాడు నాగ చైతన్య.

Related posts