telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ .. అన్నీ తెరాస కే మొగ్గు..

eone mlc nomination from trs on last day

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదా? లేదంటే కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వస్తుందా? కమల దళం ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అన్ని అంతటా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక గెలుపుపై అన్ని పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీపీఎస్ సర్వే చేసింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరే కొనసాగిందని వెల్లడించింది. టీఆర్ఎస్ దూకుడుకు విపక్షాలు కళ్లెం వేయలేకపోయాయని అభిప్రాయపడింది.

120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందని సీపీఎస్ సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్‌కు 0-4, బీజేపీకి 0-2, ఎంఐఎంకు 1-2 స్థానాలు రావొచ్చని తెలిపింది. 7-10 మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫలితాలు ఉండవచ్చని పేర్కొంది.

Related posts