telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో .. ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు..

municipal elections polling today

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహణ జరగనుంది. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్‌, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. పోలింగ్‌కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరుగుతు నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారింది. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ నెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది.

సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో మంత్రి జగదీష్‌ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్‌ బూత్‌లో మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. మిర్యాలగూడలోని పోలింగ్ సెంటర్ 59 నందు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ పట్టణంలోని 33వ వార్డులో గల నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని 14వ వార్డ్‌లో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉదయం 8 గంటల సమయంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.

Related posts