telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మున్సిపల్ ఎన్నికలపై 606 అభ్యంతరాలు: హైకోర్టు

high court on new building in telangana

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. కౌంటర్‌లో పొందుర్చిన అంశాల్లో వాస్తవం లేదని వ్యాఖ్యానించింది. మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే 606 అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మున్సిపల్ ఎన్నికలపై ఉన్న సమస్యను పక్కన పెట్టి.. ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. అయితే ఏ ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పాత ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి.. కొత్త ఆర్డినెన్స్‌కు సపోర్టు తీసుకుంటామని దీనికి న్యాయవాది వివరించారు.

Related posts