telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్”తో వైద్య వృత్తి పట్ల ప్రజలకు తప్పుడు సందేశం… మహారాష్ట్ర మంత్రికి డాక్టర్ లేఖ

Kabir-Singh

టాలీవుడ్లో చిన్న సినిమాగా రూపొందిన “అర్జున్ రెడ్డి” అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయ్ దేవరకొండను స్టార్ రేసులోకి తీసుకొచ్చింది. సందీప్ వంగా దర్శకత్వం ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా “కబీర్ సింగ్” టైటిల్ తో తెరకెక్కించారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనతో అదరగొట్టేశాడు. సందీప్ వంగా దర్శకత్వం బావుందని అంటున్నారు. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే 80 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రంపై బాలీవుడ్ విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు. “కబీర్” సింగ్ సినిమాపై విమర్శకుల నుంచే కాదు డాక్టర్ల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. “కబీర్ సింగ్” సినిమా వైద్యులను నెగెటివ్ కోణంలో చూపించేలా ఉందని ముంబైకి చెందిన డాక్టర్ ప్రదీప్ ఘాట్గే మండిపడుతున్నారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండేకు ఓ లేఖ రాశారు. “కబీర్ సింగ్” సినిమా వైద్య వృత్తి పట్ల ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపించేలా ఉందని లేఖలో పేర్కొన్నారు.

Related posts