telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రపంచంలోనే రద్దీగల మహానగరం మనదేశంలోనే…!

Mumbai

ప్రపంచంలోనే రద్దీ అయిన మహానగరం ఏంటో తెలుసా ?… అది మనదేశంలోనే ఉన్న ముంబై మహానగరం.. బడుగు జీవుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు ఇదే ఆవాసం. కూలీ పనులకు వెళ్లే వారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే ప్రజలతో ఈ మహానగరం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా వాహనాల రొదతో చెవులు మార్మోగుతుంటాయి. అలాంటి ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయినది. లొకేషన్‌ టెక్నాలజీ నిపుణులైన టామ్‌ టామ్‌ అనే సంస్థ ప్రపంచ నగరాల్లోని ట్రాఫిక్‌పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ నగరాల్లో ముంబైలోనే ట్రాఫిక్‌ సమస్య అత్యధికమని నివేదికలో తెలిపింది. ఈ నగరంలో రద్దీ వేళల్లో గమ్యస్థానాలకు వెళ్లాలంటే 65 శాతం ఎక్కువ సమయం సమయం పడుతోందని పేర్కొంది. 2017తో పోలిస్తే ఈ సమయం 1 శాతం తగ్గడం గమనార్హం. ముంబై తర్వాత కొలంబియా రాజధాని బొగొటలో 63 శాత), పెరూలోని లిమా 58 శాతంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. ఇక ఈ జాబితాలో దేశ రాజధాని న్యూఢిల్లీ 58 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.

Related posts