telugu navyamedia
telugu cinema news trending

దుల్కర్ సల్మాన్ కు పోలిసుల వార్నింగ్

Dullquar-Salman

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తాజాగా ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో సైతం నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డారు దుల్కర్ సల్మాన్. అసలేం జరిగిందంటే… దుల్కర్ సల్మాన్ తాను నడుపుతున్న కార్ స్టీరింగ్ వదిలేసి, ఫోన్ లో ఎదో చూసుకుంటున్నారు. ఈ వీడియోను సోనమ్ కపూర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ముంబై పోలీసులు వెంటనే స్పందించి… ఇలాంటి పనులు మానుకోవాలని సూచిస్తూ మీ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా స్టార్ అయ్యి ఉండి, రోడ్లపై ఇలాంటి పనులేంటి ? అంటూ దుల్కర్ సల్మాన్ పై మండిపడుతున్నారు.

ఇది గమనించిన దుల్కర్ ఆ కారును తాను డ్రైవ్ చేయడం లేదంటూ, ఓ భారీ ట్రక్కు తన కారును లాగుతోందని, “ది జోయా ఫ్యాక్టర్” సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో తాను కారు కూడా స్టార్ట్ చేయలేదని స్పష్టం చేశారు దుల్కర్. షూటింగ్ టైం లో డ్రైవర్ సీట్లో కూర్చుని మొబైల్ చెక్ చేసుకుంటుంటే సోనమ్ తీసిన వీడియో అని వెల్లడించారు. ఇదే విషయాన్ని సోనమ్ కూడా ఒప్పుకుంటూ రోడ్డు భద్రతలో భాగంగా ఈ వీడియోను పోస్ట్ చేసినట్లుగా, ముంబై పోలీసులు ఈ విషయంలో బాగా స్పందించారని, అందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలంటూ సలహా ఇచ్చింది.




Related posts

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

బరిలో ఉండాలనే నిర్ణయించుకున్న .. నిజామాబాద్ రైతులు..

vimala p

“డియర్ కామ్రేడ్”లో లిప్ లాక్… స్పందించిన రష్మిక

vimala p