telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఈ పోలీస్ అధికారి లో దుస్తులు విప్పి ఏం చేశాడంటే…!?

women abused for being good

మహారాష్ట్రలో పంత్ నగర్లోవ హరీష్ చంద్ర లహానే (41) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉండగా, పోలీస్ క్వార్టర్స్‌లో కేటాయించిన ఇంటిలో నివశిస్తున్నాడు. అయితే, పక్క క్వార్టర్స్‌లో పోలీస్ ఉన్నతాధికారి కుటుంబం నివాసం ఉంటుంది. ఈయనకు 22 యేళ్ళ కుమార్తె కూడా ఉంది. ఆమెపై కన్నేసిన లహానీ.. ఆ యువతి బాల్కనీలోకి వచ్చినపుడల్లా సైగలు చేయడం, ముద్దులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో బాధిత యువతి తన ఇంటిలోని బాల్కనీలో నిల్చుని తమ బంధువుతో ఫోనులో మాట్లాడుతుండగా లహానే తన బాల్కనీ నుంచి ఆమెకు అసభ్యంగా సైగలు చేశాడు.

అంతటితో ఆగని లహానే లోదుస్తులన్నీ విప్పి, మర్మాంగాన్ని చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత యువతి ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి నెహ్రూనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లహానేను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రక్షకులుగా ఉండాల్సిన వారే ఇలా కీచకులుగా మారితే ఇక ఈ సమాజంలో రక్షణ ఎక్కడుంటుంది.

Related posts