17 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఓ ఎన్నారై మహిళ కొంతకాలం క్రితం పనిమీద ముంబై నగరానికి వచ్చింది. ఇక్కడ మెడికల్ షాప్ నడుపుతున్న జునైద్ అన్సారీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయమైంది. తనకు ఇద్దరు పిల్లలున్నారని, మొదటి భర్తతో విడాకులు తీసుకున్నానని ఆమె జునైద్‌కు చెప్పింది. ఆమె గురించి తెలుసుకున్న జునైద్.. ఆమెతో టచ్‌లో ఉన్నాడు. ఇద్దరూ ఫేస్బుక్, వాట్సాప్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయిన ఆమె మళ్లీ కొన్ని రోజుల తర్వాత ముంబై వచ్చింది. ఆ సమయంలో జునైద్ ఆమెను తన కారులో ఊరంతా తిప్పాడు. కచ్చితంగా పెళ్లాడతానని మాటిచ్చి ఓ నిర్మానుష్యప్రదేశంలో ఆమెను లోబరుచుకున్నాడు. కారులోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత లండన్ తిరిగెళ్లిన ఆమెను వివాహం చేసుకోవడం కుదరదని, తన కుటుంబం ఒప్పుకోవడంలేదని చెప్పాడు. దీంతో ఖంగుతిన్న ఆమె.. ముంబై వచ్చి జునైద్‌ను నిలదీసింది. అయితే ఆమె వేదనను పట్టించుకోని జునైద్.. పెళ్లి చేసుకోవడం కుదరని తేల్చిచెప్పాడు. అక్కడితో ఆగకుండా ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. జునైద్‌పై ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. జునైద్‌పై అత్యాచారం కేసు నమోదు చేసుకొని కటకటాల్లోకి నెట్టారు.
previous post