telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : గాడిలో పడిన ముంబై..

గత పరాజయం నుంచి కోలుకుని ముంబయి మళ్లీ గాడిలో పడింది.. బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించింది. ఐపీఎల్ లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మలింగ (4/31) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6×4, 5×6) టాప్‌ స్కోరర్‌. డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

172 పరుగుల ఛేదనలో ముంబయికి ఓపెనర్లు రోహిత్‌ (28; 19 బంతుల్లో 2×4, 2×6), డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6) శుభారంభం ఇచ్చారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేయడంతో ముంబయి విజయం దిశగా అడుగులు వేసింది. అయితే మొయిన్‌ అలీ (2/18) ఒకే ఓవర్లో రోహిత్‌, డికాక్‌ను ఔట్‌ చేసి ముంబయిని దెబ్బ కొట్టాడు. అయితే సూర్యకుమార్‌ (29; 23 బంతుల్లో 2×4, 1×6), ఇషాన్‌ కిషన్‌ (21; 9 బంతుల్లో 3×6) ధాటిగా ఆడడంతో ముంబయి ఒక దశలో 104/2తో లక్ష్యం దిశగా సాగింది. అయితే చాహల్‌ సూర్యకుమార్‌, ఇషాన్‌ను ఔట్‌ చేసి ముంబయి జోరుకు బ్రేకులు వేశాడు. ఈ స్థితిలో ధాటిగా ఆడిన హార్దిక్‌ రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమైన స్థితిలో వరుసగా 6, 4 4, 6 కొట్టి ముంబయిని విజయపథంలో నడిపించాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆరంభంలో కోహ్లి (8) వికెట్‌ కోల్పోయింది. ఈ స్థితిలో డివిలియర్స్‌, పార్థివ్‌ (28; 20 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ నిర్మించాడు. పార్థివ్‌ను పాండ్య ఔట్‌ చేసి బెంగళూరుకు బ్రేక్‌ వేశాడు. ఐతే డివిలియర్స్‌కు మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) జత కలవడంతో ఆర్‌సీబీ జోరు అందుకుంది. 19 ఓవర్లకు బెంగళూరు స్కోరు 162/4. అయితే చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన డివిలియర్స్‌.. రెండో బంతికి రనౌట్‌ కాగా… అక్షదీప్‌ నాథ్‌ (2), నేగి (0) వికెట్లను మలింగ ఖాతాలో వేసుకోవడంతో బెంగళూరు మరింత స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.

mumbai in track again in ipl 2019 matchనేటి మ్యాచ్ : పంజాబ్ vs రాజస్థాన్; టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.

Related posts