telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఐసోలేషన్ నుంచి తప్పించుకున్న రోగి.. రైలు కిందపడి ఆత్మహత్య

Crime

సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఓ రోగి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబై మహానగరంలో జరిగింది. కురార్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతూ నగరంలోని రాజావాడీ ఆసుపత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో బాధితుడిని ఐసోలేషన్ గదికి తరలించారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా అతను అదృశ్యమయ్యాడు. ఐసోలేషన్‌లో ఉండాల్సిన రోగి కనిపించడం లేదంటూ ఆసుపత్రి వైద్యులు కాండివలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

మరోవైపు, శతాబ్ది ఆసుపత్రి పక్కనున్న రైలు పట్టాలపై కనిపించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని చూసిన వైద్యులు ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి అతడేనని గుర్తుపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ ఐసోలేషన్ నుంచి రోగి తప్పించుకోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో స్పందించిన బీఎంసీ మేయర్ కిశోరి పడ్నేకర్ దర్యాప్తునకు ఆదేశించారు.

Related posts