telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఒక్క మిస్డ్ కాల్ తో రూ.1.86 కోట్లు మాయం

Mumbai businessman loses Rs 1.86 crore to SIM swap fraud

ఒకేఒక్క మిస్డ్ కాల్ తో రూ.1.86 కోట్లు మాయం చేసిన ఘరానా మోసం ఒకటి ముంబయిలో వెలుగు చూసింది. పోలిసుల కథనం ప్రకారం… ముంబైకి చెందిన టెక్స్ టైల్ వ్యాపారి షా. గత నెల 27న అర్ధరాత్రి ఆయన ఫోన్ కు ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఉదయం లేవగానే ఫోన్ చూసుకున్న ఆయనకు మిస్డ్ కాల్స్ కన్పించాయి. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి తిరిగి ఫోన్ చేయగా సిమ్ బ్లాక్ అయ్యింది. ఎందుకు సిమ్ బ్లాక్ అయ్యిందో తెలుసుకోవడానికి… షా సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ చేయగా… మీ రిక్వెస్ట్ తోనే సిమ్ బ్లాక్ చేసి, కొత్త సిమ్ ఇచ్చామంటూ సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన షా వెంటనే తన బ్యాంకు ఖాతాను చెక్ చేసుకున్నాడు.

కానీ అప్పటికే రూ.1.86 కోట్లు మాయమయ్యాయి. ఈ విషయమే బ్యాంకు సిబ్బందిని అడగగా… దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్టుగా తెలిసింది. బ్యాంకు సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రయత్నించినప్పటికీ రూ.20 లక్షలను మాత్రమే వెనక్కి తేగలిగారు. మిగతా సొమ్మును మోసగాళ్లు అప్పటికే డ్రా చేయడంతో వాళ్ళు ఏం చేయలేకపోయారు. షా వెంటనే పోలీసులను సంప్రదించాడు.

షా నెంబర్ ను ముందే యాక్సెస్ చేసుకున్న మోసగాళ్లు సిమ్ స్వాప్ టెక్నాలజీ ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డిసెంబర్ 27న రాత్రి 11.15 గంటలకు షా నెంబర్ నుంచి సర్వీస్ ప్రొవైడర్లకు సిమ్ స్వాప్ రిక్వెస్ట్ వచ్చినట్టుగా పోలిసుల విచారణలో వెల్లడైంది. మోసగాళ్లు సిమ్ స్వాప్ ద్వారా కొత్త నెంబర్ ను తీసుకుంటారని, అది ఆక్టివేట్ అయ్యాక ఓటీపీ నెంబర్లన్నీ ఆ కొత్త నెంబర్ కే వస్తాయని, తద్వారా బ్యాంకు ఖాతాల నెంబర్లు, బ్యాంకింగ్ ఐడి, పాస్ వర్డ్ లను ముందే హ్యాక్ చేసుకున్న మోసగాళ్ల పని సులభమవుతుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మోసగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts