telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ముంబై లో .. ఈవీఎంలపై అఖిల పక్షం.. ముగిసింది..

chandrababu on amaravati mla quarters

ముంబైలో ఈవీఎంలపై అఖిలపక్ష సమావేశం నేడు జరిగింది. దీనికి తెలుగు రాష్ట్రాల నుండి ఏపీసీఎం చంద్రబాబు, తెలంగాణ నుండి కోదండరాం హాజరయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ, ఇప్పటికి చాలా దేశాలలో బ్యాలెట్ విధానమే ఉపగోగిస్తున్నారని అన్నారు. దేశంలో ఈవీఎం లను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని అన్నారు.

మోడీ హయాంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కూడా నిర్వీర్యం అయ్యాయని బాబు విమర్శించారు. తమ ప్రభుత్వానికి ఎదురు వెళ్లిన వారిపై ఇష్టానికి ఐటి దాడులు చూపిస్తున్నారని అన్నారు. తాజా ఎన్నికలలో కూడా ఈవీఎం సమస్యలను అధిగమించడంలో ఈసీ విఫలం అయిందని అన్నారు.

50శాతం వీవీ పాట్ స్లిప్ లను లెక్కించాలని కోర్టును ఆశ్రయించామని బాబు అన్నారు. ఓటరుకు 7 సెకండ్లు కనిపించాల్సినది కేవలం 3 సెకండ్లు మాత్రమే కనపడిందని ఆయన విరామర్సించారు. ఇన్ని మతలబులు చేసి, ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం అవమానిస్తుందని అన్నారు.

Related posts