telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

17 రోజుల్లో 34 లక్షలు… అసలు ఆ మహిళ ఏం చేసిందంటే…!?

duplicate officers theft money on election

దుబాయిలో ఓ మహిళ డబ్బులు కోసం ఏకంగా సోషల్ మీడియానే వాడేసింది. తన భర్తతో విడాకులు తీసుకున్నానని, ఇప్పుడు తనకు, తన పిల్లలకు దిక్కు లేదని, ఎవరైనా సహాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టింది. అంతే ఆ పోస్ట్‌ చూసిన వారు ఎంతలా జాలి పడ్డారంటే.. ఫొటో పెట్టిన 17 రోజుల్లోనే మహిళ బ్యాంకు అకౌంట్‌లోకి లక్షా 83 వేల 500 దిర్హామ్‌లు (రూ. 34 లక్షల 75 వేలు) వచ్చి చేరాయి. మహిళ చెప్పింది నిజమే అయి ఉంటే కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చేది కాదేమో మరి. నిజానికి మహిళ విడాకులు తీసుకున్న మాట వాస్తవమే కానీ.. పిల్లలు తండ్రి దగ్గరే ఉంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు మహిళ భర్త చూడటంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. తన మాజీ భార్య చేస్తున్న పనుల వల్ల తన పరువు, తన పిల్లల పరువు పోతోందని ఆవేదన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికి పడితే వారికి జాలితో డబ్బులు ఇవ్వద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దుబాయి‌లో కేవలం రంజాన్ సందర్భంగా 128 అడుక్కునే వాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. ఆన్‌లైన్‌లో అవతలి వారిని డబ్బులు అడగడం చట్టరీత్యా నేరమని, ఇందుకు గాను 2 లక్షల నుంచి 2.5 లక్షల దిర్హామ్‌ల వరకు జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు.

Related posts