telugu navyamedia
సినిమా వార్తలు

“ముక్కాలా… ముకాబులా” సాంగ్ రీక్రియేట్‌

ప్రభుదేవా నటించిన “ప్రేమికుడు” సినిమాలో “ముక్కాలా… ముకాబులా” అనే పాట ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ప్రభుదేవా నృత్యం, రెహమాన్‌ సంగీతం, శంకర్‌ చిత్రీకరించిన తీరు, పాటను క్లాసిక్‌గా నిలిపాయి. పాతికేళ్ళ ఈ పాట, “ప్రేమికుడు” సినిమా ప్రభుదేవాకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ తీసుకొచ్చాయి. మళ్ళీ ఇప్పుడీ పాటతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రభుదేవా. వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా రెమో దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ కోసం ‘ముక్కాలా… ముకాబులా’ పాటను తనిశ్‌ బగ్చి దర్శకత్వంలో రీక్రియేట్‌ చేశారు. ఆల్రెడీ షూటింగ్‌ కూడా పూర్తయిందని టాక్‌. ఒక నిమిషం పాటు పాటలో కనిపించే ప్రభుదేవా కష్టతరమైన పాత స్టెప్పులను సింగిల్‌ టేక్‌లో కంప్లీట్‌ చేశారట. ఆయనతో పాటు వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌ పాటలో కనిపించనున్నారు.

Related posts